6 July, 2026 | 10:16 PM

ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం

06-07-2026 09:08 PM

ఉడిపోతున్న బిల్డింగ్ పై పెచ్చులు 

- తప్పిన పెను ప్రమాదం

బెజ్జూర్(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం బిల్డింగ్ పైపెచ్చులు ఊడిపోతున్నాయి. కురుస్తున్న వర్షాలకు బిల్డింగ్ మొత్తం వర్షంతో చుక్కలు చుక్కలుగా బిల్డింగ్ నుండి నీరు కారుతోందని దీనితో కార్యాలయంలో సామాగ్రి సైతం తడిసిపోతుందని కార్యాలయం సిబ్బంది తెలుపుతున్నారు. కార్యాలయం యొక్క బిల్డింగ్ పైపెచ్చు ఒక్కసారిగా ఉడి పడిపోయింది. పైపెచ్చు ఊడిపోయిన సమయంలో ఎవరు కూడా ఆ ప్రాంతంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని కార్యాలయ సిబ్బంది తెలుపుతున్నారు.

బిల్డింగ్ మొత్తం శిథిలావస్థకు చేరుకుందని కార్యాలయ సిబ్బంది కార్యాలయంలో విధులు నిర్వహించాలంటే భయం భయంతో గడపాల్సిన పరిస్థితిగా నెలకొందని తెలుపుతున్నారు. కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు సైతం కార్యాలయంలోనికి వెళ్లాలంటే భయంతో వెళ్లాల్సిన పరిస్థితి గా మారిందని తెలుపుతున్నారు. బిల్డింగ్ ఎప్పుడు ఏగది కూలిపోతుందో తెలియని పరిస్థితిగా ఉందని తెలుపుతున్నారు. ఇట్టి సంఘటన విషయమై ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ను వివరణ కోరగా బిల్డింగ్ పెచ్చులు ఊడిన విషయమై వివరాలను ఉన్నత అధికారులకు నివేదిక పంపించామని నూతన బిల్డింగ్ మంజూరు కొరకు కోరామని తెలిపారు.