6 July, 2026 | 10:16 PM

బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి

06-07-2026 09:16 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ తెలంగాణ ధార్మిక పరిషత్ స్టేట్ జాయింట్ కన్వీనర్లు సముద్రాల దేవి ప్రసాద్, కొండమీది మల్లేశం, జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో పసునూరి తిరుపతిని జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా నియమించారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర అగ్రనాయకత్వానికి, ఎండోమెంట్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ప్రజ్ఞుల సూర్యప్రకాశ్, కో-కన్వీనర్ నిరంజన్ దేశాయ్‌లకు పసునూరి తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించడంతో పాటు దేవాలయ భూములు, ఆస్తుల రక్షణకు ఎండోమెంట్ సెల్ కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల, శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.