05-02-2026 01:47:31 AM
జిన్నారం 12వ వార్డు అభ్యర్థి ఠాకూర్ స్వాతి గణేష్ సింగ్
జిన్నారం/అమీన్‌పూర్, ఫిబ్రవరి 4: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం తో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, మళ్లీ కెసిఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని జిన్నారం 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఠాకూర్ స్వాతి గణేష్ సింగ్ తెలిపారు. గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారంలో బుధవారం యువకులతో కలిసి భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి చేసి చూపిస్తామని దానికి నేనే హామీ అని ఠాగూర్ స్వాతి గణేష్ సింగ్ అన్నారు. కార్యక్రమంలో రాజు గౌడ్, బాలిబిర్ సింగ్, శ్రీశైలం గౌడ్, రామకృష్ణ గౌడ్, వెంకటేష్ గౌడ్, సత్యనారాయణ, శంకర్,కిషన్ సింగ్, పాండర్ సింగ్, రాజు, ప్రవీణ్, శేఖర్, నరసింహ, భానుచందర్ పాల్గొన్నారు.