05-02-2026 01:46:43 AM
టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్‌రాజ్
మంచిర్యాల 20వ డివిజన్‌లో కుంటాల మౌనిక గెలుపు కోసం ప్రచారం
మంచిర్యాల, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటి స్తోంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి కొమ్ముల ప్రవీణ్ రాజ్ బుధవారం పట్టణంలోని 20వ డివిజన్‌లో ముమ్మరంగా పర్యటించారు. పార్టీ అభ్యర్థి కుంటాల మౌనిక తరఫున ఓటర్లను కలిసి అభ్యర్థించారు.
ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు కొమ్ముల ప్రవీణ్ రాజ్, అభ్యర్థి కుంటాల మౌనిక, జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ రూపొందించిన మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను వివరించారు. 20వ డివిజన్ అభివృద్ధి చెందాలంటే ’కత్తెర’ గుర్తుపై ఓటు వేసి కుంటాల మౌనికను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా ముఖ్య నాయకులు శీను, దినకర్, శివ, దీపక్, తాండూర్ మండల్ అధ్యక్షులు అనిల్ పాల్గొన్నారు.
వనపర్తి 13వ వార్డులో బాలరాజు ప్రచారం
వనపర్తి (విజయక్రాంతి): వనపర్తి మున్సిపాలిటీలె తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి బాలరాజు యాదవ్‌ను కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాలనీవాసులతో ప్రచారం ముమ్మరం చేశా రు. ప్రచారంలో మొదటిరోజు వనపర్తి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు డి విజయ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. బిసి రా జ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేసే బీసీ రాజ్యాధికార పార్టీ బలపరిచిన 13వ వార్డు అభ్యర్థి బాలరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి సరికొత్త చరిత్రను సృష్టించాలని కాలనీ ప్రజలందరినీ ఇంటింటికి తిరుగుతూ కోరారు. కార్యక్రమంలో కృష్ణ సాగర్, శేఖర్ సాగర్, రాజు సాగర్, రాంబాబు, ఖదీర్, సాదిక్, మక్బూల్, పాషా, వెంకటాచారి, సుశీల, రాధా, మైనార్టీ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.