10 May, 2026 | 2:47 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

వీడియో గేమ్స్ ఆడొద్దన్నందుకు బాలుడు ఆత్మహత్య

26-02-2026 02:28 PM

హైదరాబాద్: ఎన్కటి ఆటలే బాగుండే. ఈ ఉరుకుల, పరుగుల జిందగీలో చిన్నపోరగాళ్ల నుంచి పండు ముసలోళ్ల వరకు అందరూ ఫోన్లకు బానిసలే. స్మార్ట్ ఫోన్ల వల్ల ఎక్కడో అక్కడ ప్రాణాలు పోతున్నాయి. తాజాగా స్మార్ట్‌ఫోన్‌లో నిరంతరం వీడియో గేమ్‌లు ఆడుతుండని తండ్రి మందలించడంతో 12 ఏళ్ల బాలుడు గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సయ్యద్ నగర్ నివాసి అయిన అఫాన్ ఖాన్ అనే బాలుడు జూబ్లీ హిల్స్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. వీడియో గేమ్ లు ఆడటం, చూడటం మానేయమని హెచ్చరించాడు, ఆ బాలుడు అలాగే చేస్తూనే ఉండటంతో అతని తండ్రి ఇర్ఫాన్ ఖాన్ అతన్ని మందలించాడు. అనంతరం కుటుంబ సభ్యులు తమ బంధువు అంత్యక్రియలకు హాజరు కావడానికి వెళ్ళినప్పుడు, బాలుడు ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.