ఆక్రమాలు జాతిగితే కఠిన చర్యలు

25-09-2026 | 08:42pm

డిఆర్ డిఏ పీడీ దత్తరం.

2.47 కోట్ల ఉపాధి పనులు పట్ల  సామజిక తనిఖీ.

సిర్పూర్ యు.సెప్టెంబర్ 25:(విజయక్రాంతి ): ఉపాధి హామీ పథకం(Employment Guarantee Scheme) ద్వారా నిర్వహించిన పనుల్లో అక్రమాలు జరిగినట్లు తెలితే కఠిన చర్యలు తప్పవని డిఆర్ డి ఏ పీడీ దత్తరం అన్నారు. గత వరంరోజులుగా గ్రామాలలో సామజిక తనిఖీలు(Social Audits) నిర్వహించగా శుక్రవారం మండల కేంద్రంలో ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మండలంలో ఏప్రిల్ 2025 నుండి మర్చి 2026 వరకు రూ. 2.47 కోట్ల నిధులతో వివిధ రకాల పనులు చేపట్టడం జరిగిందన్నారు.

దీనికి సంబందించిన సామజిక తనిఖీ నిర్వహించగా మండలంలో ని పదిహేను గ్రామపంచాయతీలలో(Gram Panchayat) సిటీజన్ చార్ట్ లు లేకపోవడం, విలేజ్ మనిటరింగ్ కమిటీలు(Village Monitoring Committees) లేకపోవడం లాంటి పొరపాట్లు జరిగినట్లు తెలిందాన్నారు. దింతో పాటు పలు గ్రామాల్లో ఆశాలు పనిచేసినట్లు తెలిందాన్నారు. మరికొన్ని చోట్ల చేసిన పనికంటే ఎక్కువ నిధులు వెచ్చించి నట్లు తెలిందాన్నారు. మరికొన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్న నర్సరీలలో మొక్కలు పెంచే కార్యక్రమం లో నిర్లక్ష్యం వహించడం వలన ఏనాబై నుండి తొంబై శాతం మొక్కలు చనిపోయినట్లు తెలిందాన్నారు.

మరికొన్ని గ్రామాల్లో మొక్కలు నాటినప్పటికి ఎక్కువ మొక్కలకు ట్రాలీలా ద్వారా నీరు పోసినట్లు బిల్లులు చేసినట్లు తెలిపారు. మండలం లో అన్ని జిపిలలో ఏడు రిజిస్టర్లు నిర్వహించడం లేదన్నారు. ఈ విషయం లో ప్రతి గ్రామపంచాయతీ కు రూ. 1000 చొప్పున పెనాల్టీ వేస్తున్నట్లు తెలిపారు. ఆశాలు పనిచేసిన చోట పనులు తక్కువ ఉన్న చోట నిధులు రికవరీ కి ఆదేశిస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపి డి వో రవీందర్, ఏపీవో కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మే త విశ్వనాథ్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు