వ్యవసాయ పరిరక్షణకు, రైతాంగ హక్కుల కోసం పోరాడేది ఏఐకెఎస్

25-09-2026 | 09:32pm

ములకలపల్లి,సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): దేశ వ్యాప్తంగా వ్యవసాయ పరిరక్షణకై(Protection of Agriculture) దేశ రైతాంగ సమస్యలపై(Farmers' issues) పోరాటాలు నిర్వహించేది ఏఐకెఎస్ సంఘం మాత్రమేనని అన్నవరపు సత్యనారాయణ(Annavarapu Satyanarayana) అన్నారు.నవంబర్ 15-18 న జరిగే అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభల(All India Kisan Sabha National Conference) విజయ వంతం కోరుతూ శుక్రవారం మండల కేంద్రములోని తెలంగాణ రైతు సంఘం(Telangana Farmers Association) ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు నల్లగొండ పట్టణంలో(Nalgonda town) ఘనంగా జరగబోతున్నాయని ఈ మహాసభలల్లో దేశ రైతాంగ సమస్యలపై అనేక తీర్మానాలు ప్రవేశ పెడతారని తెలిపారు. విదేశాల నుంచి పత్తి దిగుమతి దేశంలో పెరుగుతుందని దేశ రైతాంగానికి పత్తిపంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహా కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య మాట్లాడుతూ ఎరువుల బుకింగ్ యాప్ ను తక్షణమే రద్దు చేసి పాత పద్ధతిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు యలమంచి వంశీ కృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపదను కార్పొరేట్,బడా పారిశ్రామిక పెట్టుబడిదారులకు కట్టబెడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన వెంకటేశ్వర్లు,దొడ్డ లక్ష్మీ నారాయణ,మోరంపూడి శ్రీనివాసరావు,ఊకంటి రవికుమార్,గోపగాని లక్ష్మీ నరసయ్య, భూక్యా శ్రీదేవి, రైతులు కరుటూరి కృష్ణ,దేవస్వామి హర్యా, శ్రీనివాసరావు,తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు గౌరీ నాగేశ్వరరావు,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మాలోతు రావూజ, నిమ్మల మధు, రవీందర్,శ్రీరాములు,రాఘవయ్య, శనగాని వినోద్,తేజవత్ జగ్గు, హేమని తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు