కోదాడలో 210 మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ

25-09-2026 | 10:20pm

కోదాడ సెప్టెంబర్ 25(విజయ క్రాంతి) : కోదాడ మున్సిపాలిటీ(Kodad Municipality) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme) కింద మొదటి విడతగా మంజూరైన 210 మంది లబ్ధిదారులకు(Beneficiaries) మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(Padmavati Reddy) గురువారం తన క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఇందులో 198 సాధారణ కేటగిరీ, 12 ప్రత్యేక కేటగిరీ ఇళ్లు ఉన్నాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. వార్డుల వారీగా చూస్తే 34వ వార్డులో 22, 2వ వార్డులో 16, 35వ వార్డులో 14, 11వ, 33వ వార్డుల్లో 13 చొప్పున ఇళ్లు మంజూరయ్యాయి.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ మల్లేశ్వరి, కందుల కోటేశ్వరరావు,  కోటిరెడ్డి 19వ వార్డు , షఫీ కౌన్సిలర్లువార్డుఆర్డీవో సూర్యనారాయణఅధికారులు, కమిషనర్ రామాదేవి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు