ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తి చేయండి

25-09-2026 | 09:44pm

మార్కెట్ కమిటీ చైర్మన్

బోథ్ సెప్టెంబర్ 25 ( విజయక్రాంతి) ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం ఉత్సవాన్ని(Ganesh immersion festival) పూర్తి చేసుకోవాలని బూతు మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ(Market Committee Chairman Mallepula Satyanarayana) పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని పంచముఖి హనుమాన్, హనుమాన్ ఆలయ గణేష్ మండలి మైసమ్మ గల్లి ప్రాంతంలోని స్నేహ గణేష్ మండలి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో పూజలు చేసి నిమజ్జనం రోజున ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని విగ్నేశ్వరుని కోరడం జరిగిందన్నారు . ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్నాల సురేందర్ రెడ్డి తోపాటు రావుల శంకర్ రమణ కౌసర్ ఆయా హనుమాన్ యూత్ ల సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు