వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు
02-09-2026 | 03:30pm
తంగళ్ళపల్లి(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిగెల రాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చేసిన సేవలను, ప్రజా సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ నాయకులు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని తెలిపారు.






