calender_icon.png 4 February, 2026 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Sports/Eductation

article_76540719.webp
ఆఖరి సన్నాహకం

04-02-2026

ముంబై, ఫిబ్రవరి 3: టీ20 వరల్డ్‌కప్ 2026కు కౌంట్‌డౌన్ మొదలైంది. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి టోర్నీ మొదలవనుంది. మెగా టోర్నీకి డిపెండింగ్ ఛాంపియన్ టీమిండియా సిద్ధమవుతోంది. ఇప్పటికే భారత జట్టు ముంబై చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయితే మెగా టోర్నీ కి ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. దీనిలో భాగంగా ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 6న నమీబియాతో ఆడ నుంది. ఈ మ్యాచ్‌ల ద్వారా ఆటగాళ్ల ఫామ్, కాంబినేషన్లను టీమిండియా మేనేజ్మెంట్ పరీక్షిం చనుంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఈ రెండు జట్లు తలపడగా, భారత్ విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది.

article_90205250.webp
కొలంబో చేరుకున్న పాక్

04-02-2026

కొలంబో, ఫిబ్రవరి 3: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం పాకిస్థాన్ జట్టు శ్రీలంకకు చేరుకుంది. భారర్‌తో మ్యాచ్‌ను బాయికాట్ చేస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ జట్టు రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. సల్మాన్ అలీ అఘా సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు మంగళవారం విశ్రాంతి తీసుకొని బుధవారం సిహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఐర్లాండ్‌తో తమ ఏకైక వామప్ మ్యాచ్ ఆడనుంది. పాకిస్థాన్ జట్టు భారత్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాతో గ్రూప్-ఏలో ఉంది. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్.. ఫిబ్రవరి 10న అమెరికాతో, ఫిబ్రవరి 15న భారత్, ఫిబ్రవరి 18న నమీబియాతో ఆడనుంది. అయితే భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.

article_53295759.webp
డబ్ల్యూపీఎల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్

04-02-2026

చెన్నై, ఫిబ్రవరి 3: ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ త్వరలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ ఫ్రాంచేజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. మహిళల క్రికెట్‌కు ప్రాధాన్యం ఇస్తూ, ఈ లీగ్‌లో భాగస్వామ్యం కావడం తమ తదుపరి ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు. తమిళనాడు గ్లోబల్ టూరిజం సమ్మిట్ సందర్భంగా కాశీ విశ్వనాథన్.. సీఎస్కే భవిష్యత్ ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు పురుషుల క్రికెట్‌లో బలమైన బ్రాండ్‌గా ఎదిగిన సీఎస్కే, ఇకపై మహిళల క్రికెట్‌లో కూడా తన ముద్ర వేయాలని భావిస్తోందని తెలిపారు. గ్రాస్రూట్ స్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కాశీ చెప్పారు. అందులో భాగంగానే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో జట్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.

article_43134296.webp
కమిందు మెండిస్‌కు పిలుపు

04-02-2026

కొలంబో, ఫిబ్రవరి 3: టీ20 వరల్డ్‌కప్ 2026కి ముం దు శ్రీలంక జట్టు కీలక నిర్ణ యం తీసుకుంది. అన్ని జట్ల కంటే ఆలస్యంగా స్క్వాడ్‌ను ప్రకటించిన శ్రీలంక.. జట్టులోకి కమిందు మెండిస్‌ను మళ్లీ తీసుకుంటూ, కీలక ఆటగాడు ధనంజయ డిసిల్వా ను తప్పించింది. ఇటీవల కాలంలో టీ20 ఫార్మాట్‌లో కమిందు మెండిస్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా సెలెక్టర్లు అత ని అనుభవం, మిడిలార్డర్‌లో నిలకడగా ఆడే సామర్థ్యంపై నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పటివరకు 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 540 పరుగులు చేసిన కమిందు, ఈసారి ప్రపంచ కప్‌లో కీలక పాత్ర పోషిస్తాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది. మరోవైపు ధనంజయ డిసిల్వా ఇటీవల సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

article_65006662.webp
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అమర్‌నాథ్

04-02-2026

హైదరాబాద్, ఫిబ్రవరి 3: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలాక్సీ క్రికెట్ క్లబ్‌కు చెందిన అమర్‌నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు అంబుడ్స్‌మన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2023లో జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఫోర్జరీ పత్రాలతో జగన్‌మోహన్ రావు పోటీ చేశారని అమర్‌నాథ్ దాఖలు చేసిన ఫిర్యాదుపై అంబుడ్స్‌మన్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సంస్థ కార్యకలాపాలు ఆగిపోకూడదనే ఉద్దేశంతో, రన్నరప్‌గా నిలిచి 62 ఓట్లు సాధించిన అమర్‌నాథ్ ను అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నట్లు జస్టిస్ కైత్ తెలిపారు. అమర్నాథ్ వారం రోజుల్లోగా బాధ్యతలు స్వీకరించాలని, మిగిలిన తొమ్మిది నెలల కాలానికి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతారని ఆదేశించారు.

article_51409802.webp
పాక్‌పై నిషేధం?

03-02-2026

టీ20 ప్రపంచకప్ జరుగుతుందంటే ఎవరు ట్రోఫీ గెలుస్తారు.. ఏ టీమ్ సంచలనాలు సృష్టిస్తుంది.. ఏ బ్యాటర్ చెలరేగిపోతాడు.. ఇవే ప్రశ్నలు వినిపిస్తుంటాయి..కానీ ఈ సారి అసలు కంటే ఇతర అంశాలే హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తున్నామంటూ ప్రకటించడంతో అటు ఐసీసీ సీరియస్ అయింది. పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దీంతో పాక్‌పై కఠిన చర్యలకు ఐసీసీ సిద్ధమవుతోంది. దీని కోసం ఒకటిరెండు రోజుల్లో ఐసీసీ కీలక సమావేశం జరగనుండగా.. ఏం చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

article_67552397.webp
ఎలిమినేట్ అయ్యేదెవరో?

03-02-2026

వడోదర, ఫిబ్రవరి 2 : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చివరి దశకు చేరిం ది. రెండు జట్లు ఇంటిదారి పడితే, మరో మూడు జట్లు ముందంజ వేశాయి. టైటిల్ వేటలో దూసుకెళుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిగిలిన జట్లపై ఆధిపత్యం కనబరిచి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే మరో రెండు జట్లు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ ఎలిమినేటర్ పోరుకు సిద్ధమయ్యాయి. దీనిలో గెలిచిన జట్టు ఆర్సీబీతో ఫైనల్ ఆడనుండగా.. ఓడిన జట్టు ఇం టిదారి పడుతుంది. లీగ్ స్టేజ్ ను 5 విజయాలు, 3 ఓటములతో రెండో స్థానంతో ముగిస్తే.. ఢిల్లీ 4 గెలుపు, మూడు ఓటములతో తర్వాతి స్థానంలో నిలిచింది. అయితే లీగ్ స్టేజ్ లో ఇరు జట్లు రెండుసార్లు తలపడితే గుజరాత్ జెయింట్స్ దే పైచేయిగా నిలిచింది.

article_77894649.webp
పాక్ మ్యాచ్ బహిష్కరణపై ఐసీసీ ఆందోళన

02-02-2026

2026 టీ20 ప్రపంచ కప్‌కు(World Cup) సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ జట్టు టీ20 టోర్నమెంట్‌లో(T20 Tournament) పాల్గొన్నప్పటికీ, భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 15న కొలంబోలో గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత్‌తో పాకిస్థాన్ తలపడాల్సి ఉంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుండి తొలగించిన నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం(Pakistan Government) ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిస్పందనగా, ఐసీసీ పాకిస్థాన్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఇందులో భాగంగా ఆ జట్టును ఈవెంట్‌లో పాల్గొనకుండా నిషేధించే అవకాశం కూడా ఉంది. టీ20 ప్రపంచ కప్(T20 World Cup) వివాదం భారత్-పాకిస్థాన్ ఇద్దరికీ నష్టమేనని విశ్లేషకులు తెలిపారు.