11 May, 2026 | 12:17 PM

Breaking News

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •  

ఎలిమినేట్ అయ్యేదెవరో?

03-02-2026 01:14 AM

నాకౌట్‌కు ఢిల్లీ , గుజరాత్ రెడీ

వడోదర, ఫిబ్రవరి 2 : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చివరి దశకు చేరింది. రెండు జట్లు ఇంటిదారి పడితే, మరో మూడు జట్లు ముందంజ వేశాయి. టైటిల్ వేటలో దూసుకెళుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిగిలిన జట్లపై ఆధిపత్యం కనబరిచి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే మరో రెండు జట్లు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ ఎలిమినేటర్ పోరుకు సిద్ధమయ్యాయి. దీనిలో గెలిచిన జట్టు ఆర్సీబీతో ఫైనల్ ఆడనుండగా.. ఓడిన జట్టు ఇం టిదారి పడుతుంది. లీగ్ స్టేజ్ ను 5 విజయాలు, 3 ఓటములతో రెండో స్థానంతో ముగిస్తే.. ఢిల్లీ 4 గెలుపు, మూడు ఓటములతో తర్వాతి స్థానంలో నిలిచింది. అయితే లీగ్ స్టేజ్ లో ఇరు జట్లు రెండుసార్లు తలపడితే గుజరాత్ జెయింట్స్ దే పైచేయిగా నిలిచింది.

తొలిసారి 4 పరుగులతోనూ తర్వాత 3 రన్స్ తోనూ ఢిల్లీపై గుజరాత్ గెలిచింది. ఇదిలా ఉంటే ఎలిమినేటర్ మ్యాచ్ కావడం తో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. తమ తమ చివరి మ్యాచ్ లలో ఢిల్లీ , యూపీ వారియర్స్‌ను చిత్తు చేస్తే... గుజరాత్, ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ నిలకడగా రాణిస్తోంది. తొలి రెండు మ్యాచ్ లలో గెలిచిన తర్వాత హ్యాట్రిక్ ఓటములతో వెనుకబ డింది. కానీ కీలక సమయంలో పుంజుకుని మళ్లీ హ్యాట్రిక్ విజయాలతో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది.

ఆష్లే గార్డనర్ సారథ్యంలోని గుజరాత్ కు బెత్ మూనీ, సోఫీ డివైన్ తో పాటు అనుష్క శర్మ, రేణుకా ఠాగూర్ కీలకం కానున్నారు.ఆష్లే గార్డనర్, అనుష్క శర్మ ఫామ్ లో ఉండడం అడ్వాంంటేజ్. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా టోర్నీలో అద్భుతంగా పుంజుకుంది. తొలిసారి జట్టు పగ్గాలు అందుకున్న జెమీమా రోడ్రిగ్స్ ఆరంభంలో కాస్త ఒత్డిడికి గురైనట్టు కనిపించింది. లేడీ సెహ్వాగ్  షెఫాలీ వర్మ ఇప్పటి వరకూ పెద్దగా ఆడింది లేదు. దీంతో ఎలిమినేటర్ లో ఆమె నుంచి టీమ్ మేనేజ్ మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. అలాగే ఢిల్లీ జట్టు లారా వోల్వార్ట్, మరిజెన్నా కాప్, లిజెల్లీ లీ, శ్రీచరణి, మిన్నూ మణి, చినెల్లీ, స్నేహరాణపై అంచనాలున్నాయి. మ్యాచ్ కు ఆతిథ్య మిస్తున్న వడోదర పిచ్ స్లో బౌలర్లకు అనుకూలిస్తుందని అంచనా.