04-02-2026 06:21:31 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం కార్యాలయ సిబ్బంది తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అందరూ ప్రతిజ్ఞ విధిగా చదివారు .రాష్ట్రంలో అందరూ విధిగా సామాజిక న్యాయం పాటించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ఎంపీడీవో రమాకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సి హెచ్ రత్నాకర్ రావు, ఈజీఎస్ ఏపీవో రమేష్, సూపరింటెండెంట్ ఎల్ ఎన్ స్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.