calender_icon.png 4 February, 2026 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

04-02-2026 06:12:42 PM

ఏఎస్సార్ కాలనీలో శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే 

భద్రాచలం (విజయ క్రాంతి): భద్రాచలం పట్టణంలోని అల్లూరి సీతారామరాజు (ఏఎస్సార్) కాలనీలో కొలువై ఉన్న శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సర్పంచ్  పూనెం కృష్ణ, ఉప సర్పంచ్ రత్నం కవిత, వార్డు మెంబర్లు సున్నం భూలక్ష్మి, జగ్గా కుమారి  సందర్శించి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కుంజా ధర్మారావు, కుంజా సంతోష్, సవలం వంశీ, సోడే సావిత్రి, కోడి తులసి, తాటి రుక్మిణిలు ఎమ్మెల్యేకు, ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు  మాట్లాడుతూ, వచ్చే నెల మార్చిలో నిర్వహించబోయే మూడు రోజుల శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను భక్తుల సహకారంతో ఘనంగా శాంతియుతంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. అలాగే ఈ జాతర ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, యువత తమ సాంప్రదాయ విలువలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.