calender_icon.png 4 February, 2026 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి

04-02-2026 06:18:40 PM

పెంచికల్ పేట్,(విజయక్రాంతి): భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏఈఓ గౌసియా అన్నారు. మండలంలోని దరోగ పల్లి గ్రామంలో బుధవారం ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై రైతులకు అవగాహన కల్పించాభూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏఈఓ గౌసియా అన్నారు. మండలంలోని దరోగ పల్లి గ్రామంలో బుధవారం ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై రైతులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ సహాయం పొందాలంటే తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలను పొందాలన్నా పంటలను కొనుగోలు అమ్మకాలు చేపట్టాలన్న ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అవసరమని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలతోపాటు చెడ్వాయి క్లస్టర్ రైతులు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం రైతు వేదికలోని వ్యవసాయ అధికారులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరీష్ మరియు రైతులు పాల్గొన్నారు.