5 April, 2026 | 6:03 PM

పెద్దపల్లిలో జగ్జీవన్ రాంకు నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్

05-04-2026 10:49 AM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ చౌరస్తా వద్ద ఆదివారం  జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం 119వ జయంతిని పురస్కరించుకొని వారి విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, పట్టణ కౌన్సిలర్లు, దళిత సంఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.