పెద్దమల్లారెడ్డిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
05-04-2026 10:46 AM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. ఆయన ఆశయాలను అనుసరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడూరి సాయగౌడ్, ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి,వార్డు సభ్యులు మాధవరెడ్డి, నట్ట లింగం, రాకేష్, తదితరులు, గ్రామ పెద్దలు మరియు నాయకులు పాల్గొన్నారు.




