5 April, 2026 | 6:19 PM

సీతారాంపల్లిలో పిడుగుపడి గేదె మృతి

05-04-2026 10:56 AM

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండలం సీతారాంపల్లి గ్రామంలో తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో పిడుగు పడడంతో చెరుకు సిద్ధరాములు చెందిన గేదె మృతి చెందింది. ఈ ఘటనతో రైతు కుటుంబం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. అకాల వర్షాలు, పిడుగుపాట్ల వల్ల పశువుల నష్టం జరుగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.