4 April, 2026 | 7:34 PM

పంచాయితీ కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం

04-04-2026 05:43 PM

తోటి కార్మికుని కుటుంబానికి అండగా కార్మికులు

కారేపల్లి,(విజయక్రాంతి): భాగ్యనగర్ తండా పంచాయితీ కార్మికుడు దసనియా రాంసింగ్ ఇటీవల హఠాన్మరణం చెందగా, ఆయన దశదిన కార్యక్రమం సందర్భంగా తోటి కార్మికులు మానవత్వాన్ని చాటుకున్నారు. మేమంతా ఒక్కటే అనే భావనతో, సహచరులు అందరూ కలిసి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా రాంసింగ్ కుటుంబ సభ్యులకు రూ.5,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

భవిష్యత్తులో కూడా ఎవరికైనా ఆపద వస్తే ఒకరికి ఒకరం తోడుగా ఉంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ హీరాలాల్, పంచాయితీ కార్యదర్శి అనిల్ కుమార్, వార్డు సభ్యుడు గాంధీ, పంచాయితీ సిబ్బంది నంద, హేంచంద్, రాందాస్, రమేష్, గణేష్, రాధ, అఖిల్, అలాగే కుటుంబ సభ్యులు వీరన్న, చరణ్ తదితరులు పాల్గొన్నారు.