16 August, 2026 | 11:19 AM

సీయుఈటీ పీజీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థికి సన్మానం చేసిన సర్పంచ్

16-08-2026 09:12 AM

ఎంఏ తెలుగు సీటు సాధించిన గొర్రె చైతన్య

నాగిరెడ్డిపేట్,ఆగస్టు 16 (విజయక్రాంతి): మండలంలోని మాసంపల్లి గ్రామానికి చెందిన గొర్రె చైతన్య కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టులో ఇటీవల ప్రతిభ కనపరిచింది.మాసానిపల్లి గ్రామానికి చెందిన గొర్రె చైతన్య ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ (తెలుగు) పీజీ కోర్సులో ప్రవేశానికి సీటు సాధించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెద్దపట్లలో సునంద కిషన్ రెడ్డి పంద్రాగస్టు వేడుకలు సందర్భంగా శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెద్దపట్లలో సునంద కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతిష్టాత్మకంగా కేంద్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు ప్రవేశానికి సీటు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.మరిన్ని ఉన్నత విద్యలో విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్దపట్లలో సునంద కిషన్ రెడ్డి,మాజీ సర్పంచులు అంజా గౌడ్,  వరిగే విట్టల్,పంచాయతీ కార్యదర్శి సుభాష్ రెడ్డి,కారోబార్ నర్సింలు,వార్డుమెంబర్లు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు గంగయ్య, ఏసుదాసు,బాబాగౌడ్ సందీప్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.