16 August, 2026 | 2:19 PM

ఆహ్వాన పత్రిక ఇచ్చి.. అరెస్టు చేయడం సిగ్గుచేటు

16-08-2026 01:24 PM

బిజెపి నాయకులు ధ్వజం 

బిచ్కుంద ఆగస్టు 16 (విజయక్రాంతి): జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు కూతురు పెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చి అరెస్టు చేయడం సిగ్గుచేటని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు శెట్టిపల్లి విష్ణు ధ్వజమెత్తారు. ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు(Jukkal MLA Thota Lakshmikantha Rao) కూతురు వివాహ మహోత్సవం కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా ముందస్తుగా బిజెపి నాయకులకు పోలీసులు అరెస్టు చేశారు. దీనిని నిరసిస్తూ బిజెపి మండల అధ్యక్షులు శెట్టిపల్లి విష్ణు మాట్లాడుతూ... జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పార్టీలకతీతంగా మా కూతురి వివాహ మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికలు ఇచ్చి అరెస్టు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శుభకార్యానికి వచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకునేంత కిందికి దిగజారిలేదని బిజెపి నాయకులు అన్నారు. అంతా భయం ఉన్నోడివి ఎందుకు మరి బిజెపి నాయకులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ అరెస్టు కార్యక్రమంలో  గంగరాజు, కమ్మరి గంగాధర్, ధనుర్ విట్టల్, రాజు తదితరులు ఉన్నారు.