calender_icon.png 6 February, 2026 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంస్కృతిక వికాసానికి యువజన ఉత్సవాలు

06-02-2026 01:27:22 AM

కేయూ వీసీ కే.ప్రతాప్ రెడ్డి

హనుమకొండ,ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి):విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసే ప్రధాన వేదికలుగా యువజనోత్సవాల కార్యక్రమాలు నిలుస్తాయని కా కతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి కె.ప్రతా ప్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం 2047 విజన్ సాధన దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో యువత పాత్ర అత్యంత కీలకమ ని ఆయన స్పష్టం చేశారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ లక్షణాలు, సామా జిక స్పృహ పెంపొందించడంలో ఇటువంటి ఉత్సవాలు విశేషంగా దోహదపడతాయని అన్నారు.కాకతీయ విశ్వవిద్యాలయం జాతీ య సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) విభాగం ఆధ్వర్యంలో గురువారం ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఉపకులపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులలోని అంతర్లీన ప్రతిభను వెలికి తీ యడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ సందర్భంగా కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ మా ట్లాడుతూ జిల్లా స్థాయి యువజనోత్సవం లో 13 అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వివిధ కళారూపాలు, సాం స్కృతిక ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది విద్యార్థులకు అరుదైన అవకాశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి న ఆరట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుం కరి జ్యోతి మాట్లాడుతూ యువజన ఉత్సవాల నిర్వాహణ బాధ్యతను ఆరట్స్ కళాశా లకు అప్పగించడం గర్వకారణమని తెలిపా రు. కళాశాలలో విద్యా ప్రమాణాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు సమాన ప్రాధా న్యం ఇస్తున్నామని ఆమె వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కేయూ డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ ఇస్తారి, ఆరట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రెహమాన్ పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా మిమిక్రీ కళాకారుడు వెం కీ తన ప్రదర్శన ద్వారా యువతలో ఉత్సాహాన్ని నింపారు.అదే విధంగా ఎన్‌ఎస్‌ఎస్ విభాగానికి చెందిన డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ శ్రీలత, డాక్టర్ చందర్, డాక్టర్ రమేష్ పాల్గొన్నారు. వివిధ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ ప్రో గ్రాం ఆఫీసర్లు, విద్యార్థినులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.