calender_icon.png 6 February, 2026 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌తోనే వార్డు అభివృద్ధి సాధ్యం

06-02-2026 01:28:06 AM

పార్టీ అభ్యర్థి మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి

వనపర్తి 20వ వార్డులో జోరుగా నాయకుల విస్తృత ప్రచారం

వనపర్తి, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): వార్డు అభివృద్ధి జరగాలంటే అది బీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని 20వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి అన్నారు. గురువారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో జో రుగా స్థానిక బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి అభ్యర్థి ప్రచారం నిర్వహించారు.ప్రతి ఇంటికి వెళ్లి వనపర్తి పట్టణంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హయాంలో జరిగిన అభి వృద్ధి పనులను వివరిస్తూ, మరొక పక్క ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల ను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని సైతం వివరిస్తున్నామని అభ్యర్థి మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.