గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
27-07-2026 04:26 PM
కల్వకుర్తి జులై 27 : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలా సమీపంలో కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై(Kodad–Jadcherla National Highway) గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కల్వకుర్తి ఎస్సై కురుమూర్తి కథనం ప్రకారం మండలంలోని లింగసానిపల్లి గ్రామానికి చెందిన భగవంతు (22) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆదివారం ఉదయం పనికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. మార్చాలా సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.






