9 May, 2026 | 10:44 AM

Breaking News

కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •  

మీ ప్రవచనం.. ఆనందదాయకం

26-02-2026 12:59 AM

మంథనిలో గరికపాటి ప్రవచన కర్త సభలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 

మంథని, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ‘మీ ప్రవచనం వినడం ఎంతో ఆనందం కలిగించింది. ఇందుకు ఎంతో సంతోషిస్తున్నా’ అని గరికపాటి నర్సింహరావును ఉద్దేశించి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం మంథని పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం మణికంఠ ప్రాంగణంలో నిర్వహించిన గరికపాటి నరసింహారావు 2వ రోజు ప్రవచనం కార్య క్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ముక్కు సూటిగా మాట్లాడే తత్వం కలిగిన గరికపాటిలా ప్రవచనం చెప్పేవారు దేశంలో మరి ఎవరూ లేరని కొనియాడారు. గరికపాటి చెప్పినట్లు వేయి పడగలకు సంబంధించిన అంశం విషయంలో స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మంథని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజలే కాకుండా యావ త్ రాష్ట్ర ప్రజలందరూ మీ ప్రవచనాలు వినే భాగ్యం కలగాలని మంత్రి కోరారు.

గరికపాటి మా నాన్నగారిని గుర్తు చేస్తూ రాబో యే రోజుల్లో మేము ఏ విధంగా ఉండాలని సవివరంగా సూచించడం మాకు మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమం లో అయ్యప్ప ఆలయ కమిటీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, మంత్రపురి ధర్మ ప్రచార సమితి చైర్మ న్ మోహన్ శర్మ, కొంతం సత్యనారాయణ పాల్గొన్నారు.