9 May, 2026 | 11:05 AM

Breaking News

ఒంగోలులో భూకంపం.. భయపడ్డ జనం   •   కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •  

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు

09-05-2026 10:17 AM

బిజినేపల్లి : తిమ్మాజిపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలిక ప్రేమ పేరుతో మోసపోయి గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక గర్భం దాల్చడానికి కారణం అయిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిమ్మాజిపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో వెంట తిరిగాడు. పెళ్ళి చేసుకుంటానని ఆ యువకుడు మైనర్ బాలికతో లైంగికంగా వాడుకోవడంతో ప్రస్తుతం ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు ఆ యువకుడిని పెళ్లి చేసుకోవాలని నిలదీశారు. ఇందుకు ఆ యువకుడు నిరాకరించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాలిక ఫిర్యాదుతో శుక్రవారం నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టారు.