హెల్మెట్ ఒక వస్తువు కాదు, ప్రాణాన్ని కాపాడే రక్షణ ఆయుధం
పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి
సుల్తానాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): అరైవ్-అలైవ్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగాలపై అవగాహన కల్పించారు. అనంతరం హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించిన వా హనదారులకు పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి,ఏసీపీ జి. కృష్ణ కలిసి గులాబీ పువ్వులు అందించి అభినందించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రతి మోటార్ సైకిల్ వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
హెల్మెట్ ధరించని వారిపై తరచుగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి కే సులు నమోదు చేస్తామని తెలిపారు. హెల్మె ట్ ఒక వస్తువు కాదు ప్రాణాన్ని కాపాడే రక్ష ణ ఆయుధం అన్నారు, రోడ్ చిన్నదైనా పెద్దదైనా ప్రమాదం ఎప్పుడైనా, ఎక్కడైనా సంభ వించవచ్చని, అందువల్ల ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ చంద్ర కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.




