3 July, 2026 | 1:38 AM

మీ డ్రామా బిగ్‌బాస్ షోను తలపిస్తోంది

03-07-2026 12:45 AM
  1. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటన అద్భుతం
  2. అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే.. అర్హులు మీరే
  3. గురుకులాల టెండర్లు, అప్పులు, అవినీతి, అక్రమాలపై ప్రజల ముందు చర్చిద్దాం రండి
  4. కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ‘వారెవ్వా..మీ డ్రామాలు బిగ్ బాస్ షోను తలపిస్తోంది’ అని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను ఉద్దేశించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య కొనసాగుతున్న రాజకీయ విమర్శలపై గురువారం ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటన అద్భుతమని పేర్కొన్నారు.

ప్రతి వారం ముందే రిహార్సల్ చేసుకుని పోటాపోటీగా నటనలో జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే ఈ రెండు పార్టీల నేతలే అర్హులవుతారని వ్యాఖ్యానించారు. అయినా.. తెలంగాణ ప్రజలేమైనా ఎడ్డోళ్లనుకుంటున్నారా? అని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను అమాయకులుగా భావించవద్దని, ప్రజలు వారి రాజకీయ డ్రామాలను గమనిస్తూ నవ్వుకుంటున్నారని స్పష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో తేదీ, సమయం, వేదికను నిర్ణయించి, బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలకు బండి సంజయ్ సవాల్ విసిరారు. గురుకులాల టెండర్లు, తెలంగాణ అప్పులు, అవినీతి, అక్రమాలపై ప్రజల ముందు చర్చిద్దాం రండి అని సవాల్ చేశారు. ప్రజల ప్రశ్నలకు జవాబిచ్చేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనా వైఫల్యాలను ప్రజల ముం దుంచేందుకు ‘మేం రెడీ’ అని వెల్లడించారు.

మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులు, అందించిన సంక్షేమ కార్యక్రమాలపైనా చర్చిద్దాం రండి అని సవాల్ చేశారు. మీరు ఇట్లనే డ్రామాలాడితే జనం ఛీ కొట్టడం ఖాయమని హెచ్చరించా రు. ఈ రాజకీయ బిగ్‌బాస్ షోలో ప్రజలు డ బ్బుల ఎలిమినేషన్ కోరుకుంటున్నారని, తె లంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆకాంక్షిస్తున్నారని స్పష్టం చేశారు.