3 July, 2026 | 1:38 AM

యూరియా సరఫరాలో అక్రమాలు

03-07-2026 12:44 AM

వ్యవసాయ అధికారి సస్పెన్షన్

చేర్యాల, జూలై 2: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని శ్రీ సాయి శివ ఫెర్టిలైజర్ సేల్స్ షాప్ యజమాని సందీప్‌రెడ్డి ఈక్షు యంత్రం ద్వారా హోల్‌సేల్ డీలర్ల నుంచి 6,429 యూరియా బ్యాగుల ను స్వీకరించి, వాటిని ధృవీకరించకుండా రై తుల ఆధార్ వివరాలను ఉపయోగించి విక్రయించినట్లు చూపించి అక్రమాలకు పాల్పడి నట్లు తేలింది.

యూరియా దుర్వినియోగాని కి పాల్పడినందుకు అతనిపై పోలీసు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగే అతని లైసెన్సును వ్యవసాయ శాఖ రద్దు చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర్ స్వామిని కలెక్టర్ హైమావతి సస్పెండ్ చేశారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని శ్రీ ఆంజనేయ ఫెర్టిలైజర్స్, శ్రీ గణేష్ ట్రేడర్స్ హోల్‌సేల్ డీలర్ల నుంచి అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలడంతో వాటి లైసెన్సులను రద్దు చేశారు.