బోగత జలపాతం కళకళ
03-07-2026 12:46 AM
ములుగు, జులై ౨(విజయక్రాంతి): ము లుగు జిల్లాలో ఉన్న బొగత జలపాతం జల సవ్వడి చేస్తోంది. ఎగువన ఉన్న చత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో రెండు మూ డు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీం తో ములుగు జిల్లా వాజేడు మండలం చీకు పల్లి సమీపంలోని బోగత జలపాతంలోకి ఎగువ ప్రాంతాల నుంచి కొత్త నీరు భారీగా చేరడంతో బొగత జలపాతం మళ్లీ గలగల పారుతూ తన సహజ సౌందర్యాన్ని పర్యాట కులకు పంచుతోంది. ‘తెలంగాణ నయాగ రా’గా పేరొందిన బోగత జలపాతం ప్రస్తు తం పాలధారలా ఉప్పొంగుతూ ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో నీటి ప్రవా హం మరింత పెరిగే అవకాశం ఉందని స్థాని కులు చెబుతున్నారు.






