3 July, 2026 | 2:43 AM

అల్ఫోర్స్ స్కూల్ హౌస్ ఎలక్షన్స్

03-07-2026 01:37 AM

కొత్తపల్లి, జూలై 2 (విజయక్రాంతి): కొత్తపల్లి లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో గురువారం హౌస్ ఎలక్షన్స్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు బాల్యదశ నుండే నాయకత్వపు లక్షణాలను అలవర్చాలని, వివిధ రకాల ఎన్నికల గురించి తెలియపరచాలని అన్నారు.

ప్రధానంగా పోటీలో ఉండడానికి చాలా ప్రోత్సాహం అందించాలని, వాటి ప్రభావాలను విద్యార్థులకు తెలియజేయడం ద్వారా పాఠశాల వ్యవస్థ చాలా చక్కగా కొనసాగుతుందని పాఠశాలలోని వివిధ విభాగాలకు ఎన్నికలు నిర్వహించడం ఒక గొప్ప సాంప్రదాయమని తెలిపారు. ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ విద్యార్థులకు నమ్మకాన్ని పెంపొందించాలని చెప్పారు. విద్యార్థులు అందరూ చాలా ఉత్సాహంగా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.