3 July, 2026 | 2:45 AM

రెడ్డి కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పాటు చేస్తాం

03-07-2026 01:36 AM

హామీ ఇచ్చిన ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి

ముకరంపుర, జూలై 2 (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెడ్డి కార్పొరేషన్ పాలక వర్గం ఈ నెల 12 తర్వాత ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

బుధవారం రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రెడ్డి కార్పొరేషన్ కు పాలకవర్గం మరియు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వేము నరేందర్ రెడ్డిని తన స్వగృహంలో కలిసి డిమాండ్ చేయడంతో దీనికి స్పందించిన వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12 తర్వాత పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అప్పటివరకు కార్పొరేషన్ ఏర్పాటుకు గల కార్యాచరణ చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రెడ్డి ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు నాగర్తి చంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు బండ గోపాల్ రెడ్డి, నలువెలి కరుణాకర్ రెడ్డి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు,సహాయ కార్యదర్శి, ఐక్యవేదిక ప్రతినిధులు, యూత్ నాయకులు, తదితరులు ఉన్నారు.