బియ్యం ధరలకు ఎల్ నినో రెక్కలు!
ఇప్పటికే క్వింటాలుకు రూ. 800 నుంచి రూ. 1,000 ధర పెరుగుదల
ఎల్ నినో ప్రభావంతో ధాన్యం ఉత్పత్తి తగ్గితే.. ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం కసరత్తు
2025-26 ఖరీఫ్, రబీ సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యంలో మిగిలిన నిల్వలను భద్రపర్చే ఆలోచన
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఎల్ నినో.. ప్రస్తుతం అంతటా చర్చనీయాంశమైన అంశం. ఎల్ నినో ప్రభావం మొట్టమొదటగా వర్షపాతా న్ని ప్రభావితం చేస్తే.. పంటలు పండక వరి ధాన్యం దిగుబడిపై పంజా విసరడం ఖాయమని స్పష్టమవుతున్నది. దీంతో వర్షాకాలానికి రెండు నెలల ముందు నుంచే బియ్యం ధరలు పెరుగుతున్నాయి.
దీనికి ఎల్ నినో ప్రభావ మే కారణమంటున్నారు వ్యాపారవేత్త లు, రైస్ మిల్లర్లు. ఎల్ నినో ప్రభావం ఇప్పటికే మన కండ్లముందు కనపడుతోంది. నిన్నమొన్నటి వరకు ఎండాకా లంలో తీవ్ర ఎండలు.. అలాగే వర్షాకా లం ప్రారంభమై సుమారు 20 రోజులు అవుతున్నా.. సరైన వర్షాలు కురవకపోవడాన్ని ఇప్పటికే చవిచూశాం.
జూన్ నెలలో కురవాల్సిన సా ధారణ వర్షపాతం కన్నా.. 39 శాతం తక్కువగా కురవడంతో ఈ ప్రభావం రాబోయే రోజుల్లో వ్యవసాయ రం గంపై, ఇతర రంగాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు నిత్యావసర వస్తువు అయిన బియ్యం ధరలపై దాని ప్రభావం పడుతున్నది.
పెరుగుతున్న బియ్యం ధరలు..
ధాన్యం దిగుబడిపై ఎల్ నినో ప్రభా వం చూపే అవకాశం ఉండటంతో.. బియ్యం ధరలు పెరగడం ప్రారంభమైనట్టుగా వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నారు. గడిచిన రెండు నెలల్లోనే క్వింటాలు బియ్యం సగటున రూ. 800 నుంచి రూ. 1,000 వరకు పెరిగినట్టుగా చెబుతున్నారు. ప్రస్తు తం సన్నరకం బియ్యం క్వింటాలుకు రూ. 6,000 నుంచి రూ. 6,250 వరకు ఉంది. ఇందులోనూ పాత బియ్యం ధర మరింత ఎక్కువగా ఉంది.
ఎల్ నినోకు పశ్చిమాసియాలో యుద్ధం తోడైతే మరింత ఎక్కువ ప్రభావం ఉందేది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం ముగింపునకు చేరుకోవ డంతో.. ఎల్ నినో ప్రభావం ఎంత ఉంటుందనే దానిపై ఇప్పుడే అంచనాకు రాలేకపో తున్నారు. అయితే జూన్ నెల వర్షపాతాన్ని గమనిస్తే.. ఈసారి ఖరీఫ్‌లో (2026-27 సీజన్) పంటల దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం కనపడుతోంది. రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గడం, భూగర్భ జలాలు అడుగంటడం చూడబోతున్నాం.
ధాన్యం నిలువలను భద్రపర్చే ఆలోచన..
రాబోయే కాలంలో ధరల నియంత్రణకు ధాన్యం నిల్వలను ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. 2025-26 ఖరీఫ్ (వానాకాలం)లో సేకరించిన ధాన్యంలో సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ప్రస్తుతం ప్రభు త్వం వద్ద ఉంది. ఎఫ్‌సీఐకి, సివిల్ సప్లుకి నిర్దేశించినమేరకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నా రు. అది చివరి దశలో ఉంది.
నిర్దేశించిన కోటాలో బియ్యం సరఫరా చేయగా.. మిగిలిందే 20 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలకు రెక్కలు రాకుండా.. ఈ ధాన్యం నిల్వల ను ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ ధాన్యం నిల్వలను ప్రైవేటు వ్యాపారులకు అమ్మడం ద్వారా కానీ.. నేరుగా సివిల్ సప్లు శాఖనే బి య్యంగా మార్చి బహిరంగ మార్కెట్లో విడుదల చేస్తే.. బియ్యం ధరలు నియంత్రణలో ఉంటాయనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
అందుకే 20 లక్ష మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని ఎల్ నినో ప్రభావాన్ని అడ్డుకుని, బియ్యం ధరలను నియంత్రించేందుకు ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం వేచి చూ స్తోంది. సరైన ధర వస్తే.. ప్రైవేటు వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముతుంది. లేదా మిల్లిం గ్‌చేసి నేరుగా బహిరంగ మార్కెట్లో విడుదల చేసేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది.






