వడదెబౢతో యువకుడు మృత్యువాత
23-05-2026 09:51 AM
ఖమ్మం, (విజయక్రాంతి): ఖమ్మం నగరం ముస్తఫానగర్ కీ చెందిన షేక్ సలీం [42] వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎలక్ట్రికల్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న సలీం రోజు వారి పనులు నిమిత్తమై బయిటకు వచ్చాడు. ఎలక్ట్రికల్ పనులు చేస్తుండగా సాయంకాలం 4 గంటల సమయంలో స్పృహతప్పి పడిపోయాడు. ఆ సమయంలో సమీపంలో ఎవరు లేకపోవడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సలీం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.






