యర్కారంలో బీఆర్ఎస్ నాయకుడి హత్య
మృతదేహంను గోనె సంచిలో కట్టి స్టేజి వద్ద వదిలి వెళ్లిన దుండగులు.
ఉద్రిక్తత నేపథ్యంలో గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.
సూర్యాపేట మే 23, (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) యార్కారం గ్రామంలో భగ్గుమన్న రాజకీయ కక్షలు బీఆర్ఎస్ నాయకుడు(BRS Leader Murdered), మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి.. యర్కారం స్టేజీ సమీపంలో పడేసి ఎల్లినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే తన భర్తను రాజకీయ ద్వేషంతోనే హత్య చేశారని మృతుడి భార్య ఆరోపిస్తోంది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. గతంలో రెండు హత్య కేసుల్లో మధు నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






