21-02-2026 08:18:06 PM
వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలం బనార్ కొసరా గ్రామానికి చెందిన నాగోశే రవీందర్ (31) ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వాంకిడి ఎస్సై డి. మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం, రవీందర్ మద్యం అలవాటుకులోనై పనులు చేయకుండా ఇంటిని పట్టించుకోకుండా తిరుగుతుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై మందలించడంతో మనస్తాపానికి గురై శుక్ర వారం ఇంట్లో ఆత్మహత్య చేసు కున్నట్లు పోలీసులుతెలిపారు. మృతుడి భార్య నాగోశే స్వప్న శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.