calender_icon.png 22 February, 2026 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏయూలో హ్యాకాట్రానిక్స్ 2.0 హ్యాకథాన్ ప్రారంభం

21-02-2026 08:06:09 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో జరుగుచున్న 36 గంటల హ్యాకట్రానిక్స్ 2.0  హ్యాకతాన్ ను డైరెక్టర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇంజనీరింగ్ సినాప్సిస్ వంశీకృష్ణ, కోఫౌండర్  డైరెక్టర్ ఓపెన్ టెరా స్టెమ్ వరల్డ్ క్రాంతి కిరణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ హ్యాకతాన్ ను వి.ఎల్.ఎస్.ఐ , ఏఐ ఐఓటి, రోబోటిక్స్, ట్రాక్ సాట్  విభాగాల్లో నిర్వహించుచుండగా వివిధ కళాశాలలకు చెందిన 400 కి పైగా విద్యార్థులు పాల్గొనుచున్నారు. ఈప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ నాలుగు విభాగాలలో హ్యాక్ తాన్

నిర్వహించడం తెలంగాణలో మొదటిదిగా అభివర్ణిస్తూ, ఈసిఈ విభాగాన్ని అభినందించారు. ఇటువంటి హ్యాకతాన్ నందు పాల్గొనడం వలన విద్యార్థుల సృజనాత్మకత ప్రదర్శనకు, సాంకేతిక నైపుణ్యం పెంపుదలకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఈ  డీన్ డాక్టర్ జి.విష్ణుమూర్తి, డాక్టర్ కె. శ్రీనివాస చలపతి, అసోసియేట్ డీన్ ఎస్ఓఈ,  హ్యాకతాన్ ఆర్డినేటర్లు డాక్టర్ జి. రేణుక, ఎల్. ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.