30 May, 2026 | 1:29 AM

వడదెబ్బతో యువ రైతు మృతి

30-05-2026 01:03 AM

ఆదిలాబాద్ జిల్లా సైద్‌పూర్‌లో విషాదం

ఆదిలాబాద్, మే 29 (విజయక్రాంతి): వడ దెబ్బతో యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం సైద్‌పూర్‌లో జరిగింది. సైద్‌పూర్ గ్రామానికి చెందిన పెందురు మహేందర్ (30) గత ముడు రోజుల క్రితం పొలంలో పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఎండలో పనిచేయడంతో మహేందర్ తీవ్ర అనారోగ్యనికి గురయ్యాడు. చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్‌లో చేరాడు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదారాబాద్‌కు తరలించారు. ముడు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందాడు. మృతుడుకి తల్లి, భార్య ఉన్నారు.