22 June, 2026 | 4:44 AM

ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం

21-06-2026 04:16 PM

బోథ్,(విజయక్రాంతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని సోనాల మండల కేంద్రంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగ దివస్ ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యోగ ఇన్స్ట్రక్టర్ మునిగల యోగిత ఆధ్వర్యంలో వివేకానంద పాఠశాలలో విద్యార్థులకు ప్రాణాయామం యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా యోగ ప్రాముఖ్యతను వివరించారు ప్రతి వ్యక్తికి జీవితంలో యోగ ఎంతగానో ఉపకరిస్తుంది అన్నారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు