6 August, 2026 | 2:30 AM

అవును.. డీఎస్పీని బదిలీచేశా!

06-08-2026 01:23 AM

ప్రధాని మోదీని దూషిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక కేసైనా పెట్టారా?: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి) : ప్రధాని నరేంద్రమోదీని దూషించిన వారిపై బీజేపీ పాలిత రాష్ట్రా ల్లో ఒక్క కేసైనా పెట్టారా..? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నిం చారు. ప్రధానిని దూషిస్తే తమ ప్రభుత్వం కేసు నమోదు చేసిందని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఒక డీఎస్పీని బదిలీ చేశానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారని.. అధికా రిని బదిలీ చేయడం ప్రభుత్వానికి ఉన్న అధికారమని సీఎం పేర్కొన్నారు.

తన పరిధిలో ఉంది కాబట్టే డీఎస్పీని బదిలీ చేశానని అన్నారు. బీజేపీ నేతలు కూడా అసభ్యంగా దూషిస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ నాయకులు  కాక్రోచ్ జనతా పార్టీని, విద్యార్థులను అంతకంటే ఎక్కువే దూషించారని సీఎం తెలిపారు. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేసిన సయమంలో ప్రధాని మోదీకి సంబంధించి తప్పుడు వార్తలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అయ్యాయి.

ఈ క్రమంలోనే మెటాకు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటి మాధ్యమాల్లో  ప్రధానిపై ఏఐ జనరేటెడ్ వీడియోలు, అభ్యంతరకర కంటెంట్ ప్రసారమవుతోందని హైదరాబాద్‌కు చెందిన ఇద్ద రు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మెటా ఇండియా అధిపతి అరుణ్ శ్రీనివాస్‌పై హైదరాబాద్    సై బర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేశారు.