6 August, 2026 | 2:33 AM

గుండ్ల చెరువులో గుర్రపు డెక్క తొలగించాలి

06-08-2026 01:22 AM

మన్నె గోవర్ధన్ రెడ్డి డిమాండ్

బంజారాహిల్స్, ఆగస్టు 5(విజయక్రాంతి): సమస్యలపై సమరం కార్యక్ర మంలో భాగంగా బంజారాహిల్స్ డివిజనులోని గుండ్ల చెరువును ఖైరతాబాద్ నియోజ వర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా చెరువు పరిసరాల ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులో గుర్రపు డెక్క పేరుకుపోయిందన్నారు. అమ్మవారి ఆలయం సమీపంలోని తూములు, బ్రిడ్జి కింది ప్రవాహ మార్గాలు మూసుకుపోయాయని పేర్కొన్నారు. వెంటనే గుర్రపు డెక్కను తొలగించాలని, మూసుకుపోయిన తూములను శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రభావిత బస్తీల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఫోను ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రామచందర్, విజయ్ కుమార్, శ్రీనివాస్ నాయుడు, కృష్ణ, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.