ఆదిభట్లలో ఎస్‌ఐఆర్‌పై సమీక్ష
06-08-2026 01:23 AM
ఆదిభట్ల, ఆగస్టు 5 (విజయ క్రాంతి):ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని రాగన్నగూడ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ బి. సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన (సర్ )ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండిం గ్లో ఉన్న మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, డూప్లికేట్ నమోదులకు సంబంధించిన తొలగింపు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆగస్టు 10లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు బీఎన్కే రమేష్, ఎస్. శ్రీనివాసులు, బీఎల్వో సూపర్వైజర్లు, బీఎల్వోలు, అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






