17 July, 2026 | 12:47 AM

యువ సంగ్రామ సదస్సును జయప్రదం చేయండి

17-07-2026 12:00 AM

చేవెళ్ల, జులై 16(విజయక్రాంతి): నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 18న హైదరాబాద్ సరూర్ నగర్లో జరగనున్న యువ సంగ్రామ సదస్సు ను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్ను చేవెళ్ల ఇంచార్జి దేశమల్ల ఆంజనేయులు, జిల్లా ఇంచార్జి క్యామ మల్లేష్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 2.5వేలు వంటి హామీలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని వారు విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలను నిలదీసేందుకు రంగారెడ్డి జిల్లా యువత పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలిపించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.