15 June, 2026 | 6:10 PM

Breaking News

పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •   యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం   •  

యాదాద్రి ఆలయానికి తెలంగాణ టూరిజమ్ ఎక్సెలెన్స్ అవార్డ్

27-09-2025 11:20 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): అంతర్జాతీయ పర్యాటక దినోత్సవములలో భాగముగా తెలంగాణ టూరిజమ్ ఎక్సెలెన్స్ అవార్డ్ (Telangana Tourisam Excellence Award) కు తొలి పుణ్యక్షేత్రముగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఎంపిక కాబడినది.

తేది 27.09.2025 శనివారము సా.గం 6-00లకు సంప్రదాయవేదిక శిల్పారామము నందు తెలంగాణ గౌరవ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కార్యనిర్వహణాధికారి జి. రవి, ఐఎఎస్, ఎఇఓలు జూశెట్టి కృష్ణ, గజవెల్లి రఘు వారలు ఇట్టి అవార్డును అందుకొనియున్నారు. ఇట్టి అవార్డుకు ఈ క్షేత్రమునకు ఎంపిక చేసినందుకు తెలంగాణ టూరిజం శాఖ వారికి ధన్యవాదములు తెలుపుతూ, ఇట్టి అవార్డు రావడం ఎంతో ఆనందదాయకమని executive officer జి.రవి IAS తెలియజేసారు మరియు యావత్ దేవస్థాన సిబ్బంది తమ సంతోషాన్ని వ్యక్తపరచారు.