4 April, 2026 | 3:42 AM

కుంటాలలో కుస్తీ పోటీలు

04-04-2026 12:11 AM

భైంసా, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): కుంటాల మండల కేంద్రంలో శుక్రవారం మహాదేవుని పౌర్ణమి సందర్భంగా కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను గ్రామ సర్పంచ్ జక్కుల గజేందర్ ప్రారంభించారు. ఈ పోటీలకు నిజామాబాద్ మహా రాష్ట్ర నిర్మల్ నుండి మల్లన్న యోధులు తరలివచ్చి పోటీల్లో పాల్గొన్నారు. మొదటి విజేతకు 5000 రెండో విజేతకు 3000 నగదు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాళం శ్రీనివాస్ రమణారావు పడకంటి దత్తు రమణ తదితరులు ఉన్నారు.