13 May, 2026 | 2:11 AM

శ్రీ కంఠ మహేశ్వర స్వామి దేవాలయంలో పూజలు

13-05-2026 01:13 AM

నేలకొండపల్లి, ఖమ్మం, మే 12 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం భైలవునిపల్లి గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర  స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం హనుమాన్ జయంతి సందర్భంగా భైలవునిపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజని, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు భద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెర్రిపోతుల సత్యనారాయణ, నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడవల్లి నాగరాజు, నేలకొండపల్లి మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుడిబోయిన వెంకటేశ్వర్లు, భైరవునిపల్లి సర్పంచ్ గుండపనేని లక్ష్మణరావు, మార్కెట్ డైరెక్టర్ సూర్య పెళ్లి రవి, నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యడవల్లి సైదులు, నేలకొండపల్లి మండల ఐఎన్టీయూసీ అధ్యక్షుడు గోపి ఉపేందర్, బోళ్ల శ్రీనివాసరావు గండు సైదులు, నూక నాగయ్య మాతంగి రత్నం,పసుపులేటి ఉపేందర్, పెద్ద పాక ముత్తయ్య, బాల బోయిన గోపి, మారగాని అంజయ్య,లింగరాజు తదితరులు పాల్గొన్నారు.