చిట్టాపూర్‌లో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
మల్లాపూర్, ఆగస్టు 9 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కులు, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల పరిరక్షణపై నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మట్ట సంజీవ్ మాట్లాడుతూ.. ఆదివాసుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతామని అన్నారు. ఆదివాసీలకు కల్పించిన హక్కులు పూర్తిస్థాయిలో అమలు కావడంతో పాటు, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు అందే వరకు ఉద్యమిస్తామని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శంకరమ్మ ఆశాలు, ఉప సర్పంచ్ ప్రణయ్ గౌడ్, ఐక్యవేదిక అధ్యక్షుడు నారావేని జనార్దన్, ఉపాధ్యక్షుడు సుదర్శన్‌తో పాటు గ్రామ ఆదివాసీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.






