30 May, 2026 | 10:20 AM

సిద్దిపేట మహిళల భజనలకు ప్రపంచ రికార్డు

30-05-2026 09:45 AM

11 గంటల నిర్విరామ సంకీర్తనలు

20 బృందాలను సమన్వయం చేసిన దొంగల రామ్‌రెడ్డి

సిద్దిపేట రూరల్, (విజయక్రాంతి): కరీంనగర్ కళాభారతి వేదికగా గురువారం నిర్వహించిన ఆధ్యాత్మిక భజన మహోత్సవం ప్రపంచ రికార్డుల్లో చోటు సంపాదించింది. ఉమ్మడి పది జిల్లాల నుంచి వచ్చిన సుమారు వెయ్యి మందికి పైగా మహిళలు 53 భజన బృందాలుగా ఏర్పడి 11 గంటల పాటు నిర్విరామంగా భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. మహిళల భజన ప్రదర్శనకు ‘జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్’ గుర్తింపు లభించింది. సిద్దిపేట జిల్లాకు చెందిన జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దొంగల రామ్‌రెడ్డి జిల్లా నలుమూలల నుంచి 20కు పైగా మహిళా భజన బృందాలను సమన్వయం చేసి కార్యక్రమ విజయానికి కృషి చేశారు. ఆయనను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.