30 May, 2026 | 10:19 AM

ఆసరా కోసం అడుగులు... హామీని చేతల్లో చూపిన మున్సిపల్ చైర్‌పర్సన్

30-05-2026 09:50 AM

ఆసరా కోసం అడుగులు... హామీని చేతల్లో చూపిన మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య నాగరాజు..

ఓటు కోసం ఇచ్చిన మాట అధికారం వచ్చిన తరువాత మర్చిపోకుండా, ప్రజల కష్టాన్ని దగ్గరగా చూసి పరిష్కారంగా ఆసరపించి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన రామాయంపేట మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు సర్వ నాలుగో వార్డు ప్రజల హృదయాలను తాకింది...

రామయంపేట మే 30 (విజయ క్రాంతి):  ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను మరచిపోకుండా, ప్రజలకు అవసరమైన సేవలను వారి ఇంటి ముంగిటకే తీసుకురావాలనే సంకల్పంతో రామాయంపేట మున్సిపాలిటీ 4వ వార్డు పరిధిలో ఆసరా పింఛన్ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య నాగరాజు చొరవతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఇకపై పింఛన్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సౌకర్యవంతంగా సేవలు పొందే అవకాశం కలిగింది.

ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడమే ప్రజాప్రతినిధుల అసలు బాధ్యత అని మరోసారి నిరూపిస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వార్డు ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు లావణ్య నాగరాజు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే తమ లక్ష్యం అని ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తామని పేర్కొన్నారు ప్రజల అవసరాలను గుర్తించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ  కార్యక్రమంలో కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, బైరం స్వప్న కుమార్, గుగులోత్ రవి, కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, కాంగ్రెస్ నాయకులు దాకి స్వామి, పోచమ్మల గణేష్, మోబిన్, బైరం కుమార్, 4వ వార్డు సభ్యులు ఖదీర్ బాయ్, చిలుక విరాట్, తాహెర్, హాసం, కృష్ణ, రావి, జొన్నల రవి తదితరులు పాల్గొన్నారు.