అనారోగ్యంతో సర్పంచ్ మృతి
24-07-2026 09:53 PM
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండల పరిధిలోని దంతలబోరా ఎస్సీ కాలనీ సర్పంచ్ వెంకటరమణ శనివారం మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వైద్యం నిమిత్తం భద్రాచలంలోని ఓ ఆసుపత్రిలో చేరారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలుకు ఆపరేషన్ జరిగిందని, ఆ సమయంలో రాడ్ వేసినట్లు తెలిపారు తెలుస్తోంది. తిరిగి రాడును తొలగించేందుకు భద్రాచలం ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ చేస్తున్న క్రమంలో పరిస్థితి విషమించడంతో ఖమ్మం తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతురాలికి భర్త ,ఇద్దరు పిల్లలు ఉన్నారు






